Nizamabad: మచర్లలో విషాదం మహిళ అనుమానాస్పద మృతి.. హత్యేనా?

Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం మచర్ల గ్రామంలో దేవన్న (53) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 April 2026 7:05 PM IST
Nizamabad
X

Nizamabad: మచర్లలో విషాదం మహిళ అనుమానాస్పద మృతి.. హత్యేనా?

ఆర్మూర్: ఆలూర్ మండలం మచర్ల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన సుంకరి జయపాల భార్య దేవన్న (53) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా సిఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, మహిళ మృతి అనుమానాస్పదంగా ఉన్నందున కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story