Tandur: రాయల్టీ భారం తగ్గించండి.. నాపరాతిని పునర్వర్గీకరించండి!

Tandur: తాండూరు నాపరాతిని మైనర్ మినరల్‌గా గుర్తించాలని కోరుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో క్వారీ ఓనర్స్ అసోసియేషన్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 March 2026 8:51 PM IST
Tandur
X

Tandur: రాయల్టీ భారం తగ్గించండి.. నాపరాతిని పునర్వర్గీకరించండి!

Tandur: తాండూరులోని నాపరాతి పరిశ్రమను మైనర్‌ మినరల్‌లో చేర్చేవిధంగా చూడాలని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని తాండూరు మండల క్వారీ ఓనర్స్ వెల్పేర్ అసోసియేషన్, స్టోన్ మర్చంట్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామిని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆద్వర్యంలో అసోసియేషన్ సభ్యులు భేటి అయ్యారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు తాండూరు నాపరాతి పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకవెళ్లారు. తాండూరు ప్రాంతంలో సుమారు 20 నుంచి 30వేల మంది ప్రజలు తాండూరు నాపరాతి(లైమ్ స్టోన్/షాబాద్‌ స్టోన్/నాపా స్లాబ్)పై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. తాండూరు నాపరాతిని మేజర్ మినరల్‌లోకి మార్చడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోంటున్నట్లు వివరించారు.

రాయల్టీ భారం మోయలేకపోతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు. కావున లైమ్ స్టోన్ స్లాబ్స్ / షాహాబాద్ స్టోన్‌ను మైనర్ మినరల్‌గా పునర్వర్గీకరణ చేయాలని కోరారు. రాయల్టీ, ఇతర ఛార్జీలను సవరించి సక్రమంగా నిర్ణయించాలని కోరారు. ఇందుకు మంత్రి వివేక్ వెంకట స్వామి సానుకూలంగా స్పందిస్తూ మైనర్‌ మినరల్‌లోకి మార్చే అంశాన్ని పరిశీలిస్తామని,

రాయల్టీ భారం తగ్గించేలా దృష్టిసారిస్తామని తెలిపినట్లు ఇరు అసోసియేషన్ల అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్‌, ఎంఏ నయూం(అఫ్పూ)లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ల ఉపాధ్యక్షులు ఓం ప్రకాశ్ సోమాని, మొహమ్మద్ అన్వర్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జుబైర్ పాషా తదిరులు ఉన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story