Medchal: మేడ్చల్లో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
Medchal: ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ డివిజన్‌లో సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు.
Medchal: మేడ్చల్లో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
Medchal: తెలంగాణ తెలుగు దేశం పార్టీ మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజక వర్గంలో డా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో సౌత్ కమలానగర్ లో స్వర్ణాంధ్ర సృష్టికర్త, నేటి యువత కు ఆదర్శ ప్రాయుడు, విజనరీ లీడర్, సైబరాబాద్ సృష్టికర్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి గా 2014 నుండి 2019 వరకు మరియు 2024నుండి కొనసాగుతూ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించుకొన్న నారా చంద్రబాబు నాయుడు 76 వ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వారు కొనియాడారు తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి మళ్లీ పునర్ వైభవం తీసుకొస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగు దేశం పార్టీ మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు EX కౌన్సిలర్ గడ్డమీది రాములు యాదవ్, తెలంగాణ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి నీరు కొండ సతీష్ బాబు, సీనియర్ నేతలు కొమ్ము ఉపేందర్, గోబేరు రమేష్, మత్తి వెంకట్ నాయుడు, యుండూరి వెంకటేశ్వరావు, రవి, మురళి, వెంకన్న, శ్రీను వాస్ తదితరులు పాల్గొన్నారు.




