Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం: ఒకవైపు 45 డిగ్రీల సెగ.. మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలు!

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఏపీలో 45 డిగ్రీల ఎండలతో పాటు రాయలసీమలో వర్ష సూచన ఉంది.

Arun Chilukuri
Published on: 28 April 2026 5:07 PM IST
Weather Update
X

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం: ఒకవైపు 45 డిగ్రీల సెగ.. మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలు!

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విభిన్నంగా మారుతోంది. భానుడు తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నా, మరోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వానలు కూడా పలకరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా, తెలంగాణలో సాయంత్రం వేళల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలో వాతావరణ పరిస్థితి:

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తులో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల వరకు వాతావరణం ఇలా ఉండనుంది. మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయడంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నేడు వడగాలులు వీచే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు ఇంచుమించు 45 డిగ్రీల స్థాయిలోనే కొనసాగే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి:

ఏపీలో ఎండలు మండుతుండగా, రాయలసీమ నుంచి కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని పిడుగుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story