బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీడర్ల బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌.. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు!

Telangana BJP Breakfast Meeting: హైదరాబాద్‌ బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ జరిగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, జూన్ మొదటి వారంలో జరగబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనపై చర్చించారు.

Arun Chilukuri
Updated on: 22 May 2026 12:58 PM IST
BJP
X

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీడర్ల బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌.. జూన్ మొదటి వారంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు!

Telangana BJP Breakfast Meeting: హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌ అధ్యక్షతన బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌ కొనసాగుతోంది. ఈ భేటీకి ముఖ్యఅతిథిగా తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జ్‌ అభయ్‌ పాటిల్‌ హాజరయ్యారు. పార్టీ సంస్థాగత ఇన్‌ఛార్జ్‌ చంద్రశేఖర్‌ తివారీ, ఎంపీ రఘునందన్‌, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణ, పైడి రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీష్‌బాబు, ఎమ్మెల్సీలు ఏవీఎన్‌ రెడ్డి, కొమురయ్య.. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు.

ఇక.. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, SIR ప్రక్రియ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఈ మీటింగ్‌లో చర్చించనున్నారు. అలాగే.. జూన్‌ మొదటివారంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. దీనికి ముఖ్యఅతిథిగా జాతీయ అధ్యక్షులు నితిన్‌ నబీన్‌ హాజరుకానున్నారు. పది జిల్లాలలో నూతన బీజేపీ కార్యాలయాలను ఆయన ప్రారంభించనున్నారు. దీంతో.. తెలంగాణలో బీజేపీ చీఫ్‌ నితిన్‌ నబీన్‌ పర్యటనతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌లో చర్చించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story