Ramachandra Rao: సింగరేణి స్కామ్‌ బయటపడుతుందనే కిషన్‌రెడ్డిపై టార్గెట్.. రామచందర్‌రావు సంచలన ఆరోపణలు

Ramachandra Rao: మూసీ నది పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే బాధితులకు పూర్తి న్యాయం చేశాకే పనులు మొదలుపెట్టాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 20 Jun 2026 4:22 PM IST
Ramachandra Rao
X

Ramachandra Rao: సింగరేణి స్కామ్‌ బయటపడుతుందనే కిషన్‌రెడ్డిపై టార్గెట్.. రామచందర్‌రావు సంచలన ఆరోపణలు

Ramachandra Rao: మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుకు తాము ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, అయితే ఆ ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయే బాధితులకు ముందుగా పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు గతంలో కేంద్ర రక్షణశాఖ అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఫణికుమార్‌కు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రామచందర్‌రావు రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

సింగరేణిలో జరిగిన భారీ కుంభకోణం (Scam) ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ రాజకీయాలు చేస్తోందని రామచందర్‌రావు ఆరోపించారు. అంతర్గత వర్గపోరు కారణంగానే ప్రాంతీయ పార్టీలు ముక్కలైపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు.

"రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులైనా కొన్ని స్కూళ్లలోనే పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. కనీస మౌలిక సదుపాయాలు (Infrastructure) లేని బడులు రాష్ట్రంలో లెక్కలేనన్ని ఉన్నాయి. దేశంలో కేంద్రీయ విద్యాలయాలకు ఉన్న ఆదరణ, మన రాష్ట్ర ప్రభుత్వ బడులకు ఎందుకు లేదు? ప్రైవేటు పాఠశాలలు ఎందుకు అంతగా పెరుగుతున్నాయో ప్రభుత్వం ఆలోచించాలి."

రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులను భారీగా పెంచాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ (OU) అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం మాట ఇచ్చిందని, కానీ ప్రస్తుతానికి వర్సిటీల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని మండిపడ్డారు. దానికితోడు తమ హక్కుల గురించి, సమస్యల గురించి గొంతు ఎత్తే టీచర్లు, ప్రొఫెసర్లను అక్రమంగా సస్పెండ్‌ చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రామచందర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story