Ramchander Rao: బీజేపీ చీఫ్ రామచందర్ రావు హౌస్ అరెస్ట్.. తార్నాకలో ఉద్రిక్తత!

Ramchander Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 18 April 2026 11:14 AM IST
Ramchander Rao
X

Ramchander Rao: బీజేపీ చీఫ్ రామచందర్ రావు హౌస్ అరెస్ట్.. తార్నాకలో ఉద్రిక్తత!

Ramchander Rao: తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు గృహనిర్బంధం (House Arrest) చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిని నిరసిస్తూ ఎన్డీయే ఇచ్చిన పిలుపు మేరకు, రాష్ట్ర బీజేపీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి సిద్ధమైంది.

సీఎం నివాసం వద్ద నిరసన చేపట్టేందుకు రామచందర్ రావు తన నివాసం నుంచి బయలుదేరాల్సి ఉండగా, తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన మండిపడ్డారు.

మహిళా బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని రామచందర్ రావు విమర్శించారు. "నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు" అని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఈ అరెస్టులతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story