Cabinet Meeting: రేపు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ.. కరువుపై కీలక నిర్ణయాలు!
Cabinet Meeting: రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.
Cabinet Meeting: రేపు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ.. కరువుపై కీలక నిర్ణయాలు!
Cabinet Meeting: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ అత్యవసరంగా భేటీ కానుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులతో పాటు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులపై ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాజెక్టుల రీ-ఎస్టిమేషన్స్ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటిపోతుండటంపై సమీక్షించనున్నారు. కరువును తట్టుకునేలా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును ఎలా ప్రోత్సహించాలనే అంశంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది.
పాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోంది. రాబోయే అసెంబ్లీ సభలో సరికొత్త 'మున్సిపల్ చట్టాన్ని' ప్రవేశపెట్టేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నూతన మున్సిపల్ చట్టం ముసాయిదాపై కేబినెట్‌లో విస్తృతంగా చర్చించి, దీనికి మంత్రివర్గ ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉంది. ఈ కీలక మార్పులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు ఇతర అభివృద్ధి సంక్షేమ పథకాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది.




