Telangana Census 2027: తెలంగాణలో జనగణన షెడ్యూల్ ఖరారు: మే 11 నుంచే ఇళ్ల గణన.. ప్రతి గుడిసె, బడిని లెక్కిస్తామన్న డైరెక్టర్ భారతీ హాళికెరి!
Telangana Census 2027: తెలంగాణలో ప్రతి ఇంటినీ లెక్కిస్తామని జనగణన డైరెక్టర్ భారతీ హాళికెరి స్పష్టం చేశారు. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశ ఇళ్ల గణన ప్రారంభం కానుంది. 2027 ఫిబ్రవరి నుంచి వ్యక్తిగత సమాచార సేకరణ చేపట్టనున్నారు.
Telangana Census 2027: తెలంగాణలో జనగణన షెడ్యూల్ ఖరారు: మే 11 నుంచే ఇళ్ల గణన.. ప్రతి గుడిసె, బడిని లెక్కిస్తామన్న డైరెక్టర్ భారతీ హాళికెరి!
Telangana Census 2027: తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిధిలో ఉన్న ప్రతి నివాసాన్ని, ప్రతి ఇంటినీ లెక్కిస్తామని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి ప్రకటించారు. జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన కార్యాచరణను ఆమె శనివారం మీడియాకు వివరించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాల వరకు పక్కాగా గణన జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జనగణన ప్రక్రియలో భాగంగా కేవలం ఇళ్లు మాత్రమే కాకుండా.. ఆస్పత్రులు, బడులు, గుడులు, గుడిసెలు, అద్దె భవనాలు ఇలా ఏ నిర్మాణమైనా సరే లెక్కిస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రతి భవనంలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయనేది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని వెల్లడించారు.
మొదటి దశ (మే 11 - జూన్ 9): ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి నంబర్లు మార్క్ చేస్తారు. భవనం రకం, అందులో ఉన్న ఇళ్ల సంఖ్యను గుర్తిస్తారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా బ్లాకులను విభజించి సిబ్బందిని కేటాయించారు.
రెండో దశ (2027 ఫిబ్రవరి): ఈ దశలో వ్యక్తిగత సమాచార సేకరణ మొదలవుతుంది. ప్రతి వ్యక్తి వయసు, విద్య, వృత్తి వంటి పూర్తి వివరాలను సేకరిస్తారు.
2027 ఫిబ్రవరిలో రెండో దశ ప్రారంభమయ్యేలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని, ఎన్యుమరేటర్లకు తగిన శిక్షణ ఇస్తున్నామని భారతీ హాళికెరి పేర్కొన్నారు.




