Telangana: తెలంగాణలో అదనపు వడ్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Telangana: రబీ సీజన్‌కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోలుకు కేంద్రం ఆమోదం. సవరించిన అంచనా 43.00 ఎల్‌ఎంటీలుగా నిర్ణయం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 July 2026 3:52 PM IST
Telangana
X

Telangana: తెలంగాణలో అదనపు వడ్ల కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ: తెలంగాణలో అదనంగా వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇటీవల అదనంగా వడ్లు కొనుగోలు చేయాలని కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

రబీ సీజన్ కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నులు(బియ్యం రూపంలో) పెంచేందుకు ఆమోదం తెలిపిన కేంద్రం సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43.00 లక్షల మెట్రిక్ టన్నులు (LMT) గా నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.

రాష్ట్రవ్యాప్తంగా వాహనాల స్థాన నిర్ధారణ వ్యవస్థ (Vehicle Location Tracking System - VLTS) ను 2026 సెప్టెంబర్ 30 లోపు పూర్తిగా అమలు చేయాలని నిర్ధారించిన కేంద్రం.

పార్లమెంట్ లో ఆహార & ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. వడ్ల కొనుగోలు అంచనాను పెంచినందుకు ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story