Revanth Reddy: మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Revanth Reddy: మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబయిలో భేటీ అయ్యారు.

Arun Chilukuri
Updated on: 26 Oct 2026 12:47 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో ముంబయిలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా ప్రాణహిత నదిపై నిర్మించ తలపెట్టిన ‘తుమ్మిడిహెట్టి బ్యారేజీ’ ఎత్తు ఖరారు అంశంపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తున్నారు.

ఈ కీలక భేటీలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఆవశ్యకత, డిజైన్ల అంశంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మహారాష్ట్ర సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన 148 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజీ నిర్మిస్తే ఏ మేరకు ముంపు సమస్య ఏర్పడుతుంది? ఎంత నీటిని తరలించేందుకు వీలుంటుందనే అంశాలపై చర్చించారు.

అదేవిధంగా, బ్యారేజీ ఎత్తును 152 మీటర్ల వద్ద నిర్మిస్తే తలెత్తే పరిస్థితులు, ముంపు ప్రాంతాల వివరాలను మహారాష్ట్ర సీఎంకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.

ఇరు రాష్ట్రాల సరిహద్దు నీటి వివాదాలు, ప్రాజెక్టుల నిర్మాణంలో పరస్పర సహకారంపై ఈ సమావేశంలో సానుకూలంగా చర్చిస్తున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.