Revanth Reddy: వైఎస్సార్ జయంతి.. ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు.

Arun Chilukuri
Published on: 8 July 2026 3:51 PM IST
Revanth Reddy
X

Revanth Reddy: వైఎస్సార్ జయంతి.. ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి!

Revanth Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మహానేతకు ఘనంగా నివాళులర్పించారు.

రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రజలనే తన కుటుంబంగా భావించి, వారి సంక్షేమమే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజానాయకుడిగా వారిని కొనియాడారు.

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, మానవతా దృక్పథం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story