Liquor Sales: తెలంగాణలో మందుబాబుల రికార్డు.. తొలిసారి ₹40 వేల కోట్ల మార్కును దాటిన ఎక్సైజ్ ఆదాయం!

Liquor Sales: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మద్యం అమ్మకాల ద్వారా రికార్డు స్థాయిలో ₹40,209 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడేళ్లలో ఆదాయం ఎలా పెరిగింది, నెలవారీ లెక్కలు మరియు బీర్, లిక్కర్ అమ్మకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Arun Chilukuri
Published on: 27 April 2026 12:29 PM IST
Liquor Sales
X

Liquor Sales: తెలంగాణలో మందుబాబుల రికార్డు.. తొలిసారి ₹40 వేల కోట్ల మార్కును దాటిన ఎక్సైజ్ ఆదాయం!

Liquor Sales: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డును సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం గతంలో ఎన్నడూ లేని విధంగా ₹40,209 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పుష్కర కాలంలో మద్యం ఆదాయం ఇంత భారీ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి.

ఏడేళ్లలో రెట్టింపు ఆదాయం

2018-19 ఆర్థిక సంవత్సరంలో ₹20,859 కోట్లుగా ఉన్న ఎక్సైజ్ ఆదాయం, సరిగ్గా ఏడేళ్లలో అంటే 2025-26 నాటికి రెట్టింపు అవ్వడం గమనార్హం. 2024-25లో వచ్చిన ₹37,487 కోట్లతో పోలిస్తే, ఈసారి అదనంగా ₹2,722 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. మద్యం అమ్మకాలు 7 శాతం పెరగడంతో పాటు, ధరల పెంపు కూడా ఈ రికార్డు ఆదాయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

లిక్కర్ సేల్స్ ఇలా..

లిక్కర్: 2025-26లో 382.91 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడైంది. గతేడాదితో పోలిస్తే ఇది 2 శాతం పెరుగుదల.

బీర్: గతేడాది 536.13 లక్షల కేసులు అమ్ముడవగా, ఈసారి 387.34 లక్షల కేసులకు పడిపోయింది. అంటే బీర్ అమ్మకాలు 9 శాతం తగ్గాయి.

డిసెంబర్ రికార్డు: ఏడాది మొత్తంలో డిసెంబర్ నెలలోనే అత్యధికంగా ₹5,051 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

అదనపు ఆదాయ వనరులు

మద్యం విక్రయాలతో పాటు లైసెన్స్ ఫీజులు, దరఖాస్తుల ద్వారా కూడా భారీ ఆదాయం సమకూరింది:

మద్యం దుకాణాలు: 2,620 షాపుల రెంటల్ ఫీజు ద్వారా ₹1,771 కోట్లు.

బార్లు: 1,214 బార్ల ద్వారా ₹549 కోట్లు.

దరఖాస్తులు: 95,628 అప్లికేషన్ల ద్వారా అదనంగా ₹2,869 కోట్ల ఆదాయం వచ్చింది.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఎక్సైజ్ ఆదాయం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పుష్కర కాలంగా ఎక్సైజ్‌శాఖకు అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 2015-16లో రూ. 12,706 కోట్లు, 2016-17లో రూ. 14.184 కోట్లు, 2017-18లో రూ.17,597 కోట్లు, 2018-19లో రూ.20,859 కోట్లు, 2019-20లో రూ.22,605 కోట్లు, 2020-21లో రూ.27,286 కోట్లు 2021-22లో రూ.30,783 కోట్లు , 2022-23లో రూ. 35,145 కోట్లు , 2023-24లో రూ.37,675 కోట్లు , 2024‘25లో రూ.37,488 కోట్లు 2025‘26లో రూ. 40,209 కోట్ల ఆదాయం వచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story