Telangana Fuel Crisis: హైదరాబాద్‌లో ఫ్యూయల్ క్రైసిస్: కలెక్టర్‌తో పెట్రోల్ అసోసియేషన్ కీలక భేటీ
Telangana Fuel Crisis: తెలంగాణలో మూడో రోజూ పెట్రోల్, డీజిల్ కొరత కొనసాగుతోంది. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు.
Telangana Fuel Crisis: హైదరాబాద్‌లో ఫ్యూయల్ క్రైసిస్: కలెక్టర్‌తో పెట్రోల్ అసోసియేషన్ కీలక భేటీ
Telangana Fuel Crisis: తెలంగాణ వ్యాప్తంగా ఇంధన కొరత సెగ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కూడా రాష్ట్రంలోని మెజారిటీ పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్, డీజిల్ లభ్యత తగ్గిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకపోవడంతో గందరగోళం నెలకొంది.
పెట్రోల్ బంకుల వద్ద గంటల కొద్దీ వేచి చూడలేక చాలామంది ప్రయాణికులు తమ సొంత వాహనాలను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో భాగ్యనగరంలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రధాన నగరాల్లోని అనేక బంకుల వద్ద 'నో స్టాక్' (No Stock) బోర్డులు దర్శనమిస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. స్టాక్ లేక చాలా బంకులు మూతపడటం వాహనదారులను అయోమయానికి గురిచేస్తోంది. బంకులకు ఇంధన సరఫరా సక్రమంగా అందడం లేదని డీలర్లు వాపోతున్నారు.
ఈ సంక్షోభ పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ పెట్రోల్ అసోసియేషన్ ప్రతినిధులు కాసేపట్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌తో సమావేశం కానున్నారు. ఇంధన సరఫరాలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, డిపోల నుంచి లోడింగ్ ఆలస్యం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.




