Telangana 22A land registration: 22Aపై గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్!

Telangana 22A land registration: తెలంగాణలో సెక్షన్ 22ఏ పరిధిలో ఉన్న ఆమోదిత లేఅవుట్లు, భవనాల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

Gagan kumar
Published on: 25 Sept 2026 9:26 AM IST
Telangana 22A land registration
X

Telangana 22A land registration: 22Aపై గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్!

Telangana 22A land registration: తెలంగాణలోని వేలాది మంది ఆస్తిదారులు, ఇళ్ల యజమానులు , ప్లాట్లు, ఫ్లాట్ల కొనుగోలుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా ఒక బిగ్‌ దీపావళి గిఫ్ట్‌ లాంటి అద్భుతమైన ఊరటనిచ్చింది. సంవత్సరాలుగా చుట్టుముట్టిన రిజిస్ట్రేషన్ల చిక్కుముళ్లను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం.. లక్షలాది కుటుంబాల మోముల్లో చిరునవ్వులు పూయిస్తోంది.

జీహెచ్‌ఎంసీ , హెచ్‌ఎండీఏ , డీటీసీపీ వంటి ప్రభుత్వ చట్టబద్ధ సంస్థల నుండి అన్ని అనుమతులు పక్కాగా పొందిన లేఅవుట్లు లేదా భవనాలు కూడా.. కేవలం కొన్ని సాంకేతిక లోపాలు లేదా రెవెన్యూ వర్గీకరణల వల్ల రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ పరిధిలో ఇరుక్కుపోయాయి.

దీంతో చట్టబద్ధంగా ఇల్లు కొనుక్కున్నప్పటికీ.. దానిని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, ఓనర్‌షిప్ మార్చుకోవడానికి వీలుకాక యజమానులు నానా అవస్థలు పడ్డారు. ఈ సమస్యకు శాశ్వత చెక్‌ పెట్టాలని భావించిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.. ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకువచ్చింది. అనుమతి పొందిన ఆస్తులపై 22ఏ ఆంక్షలు ఉన్నప్పటికీ, వాటి రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని తేల్చిచెప్పింది!

ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని అనేక నివాస కాలనీల ప్రజలకు ఇది అతిపెద్ద ఉపశమనం.కాలం చెల్లిన సాంకేతిక సమస్యల వల్ల ఎన్నో రోజులుగా స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ లావాదేవీలకు ఈ నిర్ణయంతో మళ్లీ సరికొత్త జీవం రానుంది. బాధితులు తమ ఆస్తికి సంబంధించిన సరైన పత్రాలతో అధికారులను ఆశ్రయించి దరఖాస్తు చేసుకోవడం ద్వారా, తమ ఆస్తులపై ఉన్న రిజిస్ట్రేషన్ ఆంక్షలను సులభంగా తొలగించుకోవచ్చు. నేరుగా రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకోవచ్చు.

కష్టపడి సంపాదించిన డబ్బుతో ఇల్లు లేదా ప్లాటు కొనుక్కుని, 'ఇది నా సొంతం' అని గర్వంగా చెప్పుకోలేక సతమతమవుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ ఆదేశాలు నిజంగానే ఒక గొప్ప వరం. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కాగితాలకే పరిమితమైన ఆస్తులకు ఇకపై సంపూర్ణ హక్కులు దక్కనున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.