Bhatti Vikramarka: ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా.. దేశంలోనే తొలిసారిగా చారిత్రాత్మక నిర్ణయం

Bhatti Vikramarka: దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులపై ఎలాంటి భారం లేకుండా రూ.కోటి బీమా పథకాన్ని అమలు చేయనుంది.

Arun Chilukuri
Published on: 10 Sept 2026 2:50 PM IST
Bhatti Vikramarka
X

Bhatti Vikramarka: ఉద్యోగులకు రూ.కోటి ఉచిత బీమా.. దేశంలోనే తొలిసారిగా చారిత్రాత్మక నిర్ణయం

Bhatti Vikramarka: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా రూ.కోటి బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వివరాలను వెల్లడించారు. ఈ బీమా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,91,056 మంది ఉద్యోగులు, పెన్షనర్లు ప్రయోజనం పొందనున్నారు.

ఈ పథకం పరిధిలోకి 5,18,293 మంది రెగ్యులర్ ఉద్యోగులు వస్తారు. కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా 5,00,158 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ మరియు తాత్కాలిక సిబ్బందికి కూడా ఈ బీమా వర్తింపజేస్తున్నారు. అలాగే 2,72,600 మంది పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు కూడా ఈ బీమా సౌకర్యం లభిస్తుంది.

ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిగా రూపాయి భారం పడకుండా ఈ భారీ బీమా పథకాన్ని అమలు చేయడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story