DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

DA Hike: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2024 జనవరి, జులై డీఏలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. రెండు డీఏలు కలిపి 6.27 శాతం పెరగనుండగా, అక్టోబర్ వేతనంతో చెల్లించనున్నారు.

Arun Chilukuri
Updated on: 7 Oct 2026 2:38 PM IST
DA Hike
X

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

DA Hike: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే వార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం 2024 జనవరి మరియు 2024 జులై నెలలకు సంబంధించిన రెండు డీఏలను తాజాగా విడుదల చేసింది. ఈ రెండు డీఏలు కలిపి ఉద్యోగుల వేతనంలో 6.27 శాతం పెరుగుదల ఉండనున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

రాబోయే అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ పెరిగిన డీఏలను ఉద్యోగులకు చెల్లించనున్నారు. డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ (GPF) ఖాతాలో జమ చేయనున్నారు. ఇక సీపీఎస్ (CPS) ఉద్యోగులకు సంబంధించి మొదటి డీఏను 33 వాయిదాలలో, రెండో డీఏను 27 వాయిదాలలో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.