School Kits: తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. 21 వస్తువులతో 'స్పెషల్ కిట్'!
School Kits: తెలంగాణలో విద్యాశాఖలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కిట్ ఇవ్వాలని నిర్ణయించింది.
School Kits: తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. 21 వస్తువులతో 'స్పెషల్ కిట్'!
School Kits: తెలంగాణలో విద్యాశాఖలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక కిట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఆ కిట్టులో ఏమి ఇవ్వాలనే దానిపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్ లో ఈ కిట్స్ ను అందజేయనుంది తెలంగాణ సర్కార్.
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు స్పెషల్ కిట్ ఇవ్వనుంది ప్రభుత్వం. మొత్తం 21 వస్తువులతో స్కూల్ కిట్ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే కలర్ స్కూల్ యూనిఫామ్ అమలు చేయనున్నారు. అన్ని రకాల పాఠశాల విద్యావ్యవస్థలో 26లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇక ఇందులో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారు 19 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇతర ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న వారు 7 లక్షల మంది ఉన్నారని సర్కార్ గుర్తించింది.
పాఠశాల విద్యార్థులు చదువులో మరింతగా రాణించే విధంగా... ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సర్కార్ భావిస్తుంది. దీంతో పాటు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్పెషల్ కిట్ ను అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా తాజాగా అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల సెక్రటరీలతో సమావేశం నిర్వహించింది విద్యా శాఖ.
మొత్తానికి ఇందులో విద్యార్థులకు సంబంధించిన స్కూల్ యూనిఫామ్స్, వాళ్లకు సంబంధించిన పేస్టులు, సబ్బులు, సామాగ్రిని భద్రపరచుకునేందుకు బాక్సులను ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది పేద మధ్యతరగతి విద్యార్ధులకు ఎంతగానో మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.


