Employees Transfers: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్: బదిలీలపై నిషేధం ఎత్తివేత.. మే 1 నుంచి ప్రక్రియ ప్రారంభం!
Employees Transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్: బదిలీలపై నిషేధం ఎత్తివేత.. మే 1 నుంచి ప్రక్రియ ప్రారంభం!
Employees Transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో (GO) విడుదల చేసింది.
జీవోలోని కీలక అంశాలు:
మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు నెల రోజుల పాటు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. ఒకే చోట కనీసం మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. బదిలీల ప్రక్రియ అంతా పారదర్శకమైన నిబంధనల ప్రకారం జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చాలా కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. మే నెల మొత్తం ఈ ప్రక్రియ సాగనున్న నేపథ్యంలో, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉద్యోగులు తమ కొత్త స్థానాల్లో చేరే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సంబంధిత శాఖలు త్వరలోనే విడుదల చేయనున్నాయి.




