Ticket Rates: లెక్క మారింది.. సినిమా టికెట్ ధరల్లో సంచలన మార్పులు

Ticket Rates: తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్త జీవో జారీ చేసింది.

Gagan kumar
Published on: 19 Aug 2026 9:01 PM IST
Ticket Rates
X

Ticket Rates: లెక్క మారింది.. సినిమా టికెట్ ధరల్లో సంచలన మార్పులు

Telangana Govt: తెలంగాణ సినిమా రంగంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సినీ పరిశ్రమ అభివృద్ధి, ప్రేక్షకుల సౌలభ్యం, చిన్న చిత్రాల మనుగడ, అలాగే సినీ కార్మికుల సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక జీవోను అందుబాటులోకి తెచ్చింది. అత్యాధునిక 2K/4K స్క్రీన్‌లు, 7.1 సౌండ్ సిస్టమ్ కలిగిన థియేటర్లకు ప్రభుత్వం స్పెషల్ థియేటర్స్ కేటగిరీని కేటాయించింది. ఇది ప్రేక్షకులకు అత్యుత్తమ సౌండ్‌తో పాటు వ్యూ పరంగా కొత్త అనుభూతిని అందిస్తుంది. సామాన్య ప్రేక్షకుడికి కూడా సినిమా వినోదం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లను నాన్-ప్రీమియం కేటగిరీ కింద సాధారణ ధరలకే విక్రయించాలని స్పష్టం చేసింది.

థియేటర్ యజమానులకు ఊరట కలిగిస్తూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు రోజుకు గరిష్టంగా ఐదు ప్రదర్శనలు ఇచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. పెద్ద సినిమాల రష్‌లో చిన్న చిత్రాలు మరుగున పడిపోకుండా ఉండేలా, ప్రతి థియేటర్‌లో రోజుకు ఒక షో తప్పనిసరిగా చిన్న చిత్రాలకే కేటాయించాలని ఆదేశించింది. రూ. 100 కోట్లకు పైగా నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన భారీ చిత్రాలకు ఈ హోదా కల్పించారు. ఈ చిత్రాలు విడుదలైన మొదటి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

పెంచిన టికెట్ ధరల ద్వారా అదనపు ప్రయోజనం పొందే సూపర్ హై బడ్జెట్ చిత్రాల నిర్మాతలు, సినీ కార్మికుల సంక్షేమ నిధికి తప్పనిసరిగా రూ. 1 కోటి జమ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. సినిమా కాంప్లెక్స్‌లు, నిర్మాతలు, సినీ కార్మికులు మరియు ప్రేక్షకుల ప్రయోజనాలను ఒకే తాటిపైకి తెచ్చిన ఈ నిర్ణయం తెలంగాణ సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story