Pensioners Relief: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ బకాయిల కోసం రూ. 1,000 కోట్లు విడుదల చేసిన సర్కార్!
Pensioners Relief: తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వం రూ. 1,000 కోట్లు విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ వరకు ఉన్న GPF బకాయిలను క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Pensioners Relief: రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్ బకాయిల కోసం రూ. 1,000 కోట్లు విడుదల చేసిన సర్కార్!
Pensioners Relief: తెలంగాణలోని విశ్రాంత ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,000 కోట్లను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వేల సంఖ్యలో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట లభించనుంది.
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఈ నిధులతో గతేడాది (2025) అక్టోబర్ వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలను పూర్తిగా క్లియర్ చేసింది. పదవీ విరమణ చేసిన తర్వాత రావాల్సిన నిధుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది.
విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాల చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వయసు మళ్లిన వారు తమ సొంత డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో, న్యాయస్థానం ఆదేశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేసి బకాయిలను పరిష్కరించింది.




