మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశాలు!

Telangana High Court: ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Arun Chilukuri
Published on: 11 Nov 2026 4:19 PM IST
మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశాలు!
X

మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశాలు!

Telangana High Court: ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో వ్యవహరించిన తీరు మరియు తీవ్ర నిర్లక్ష్యంపై మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉండగా, ఆయన గైర్హాజరు కావడాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు.

విచారణ సందర్భంగా కలెక్టర్ గైర్హాజరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. కలెక్టర్ మనూ చౌదరిని నేరుగా కోర్టులో హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌ను (CP) స్పష్టంగా ఆదేశించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారుల బాధ్యతారహిత్య ధోరణిపై హైకోర్టు ఈ విధంగా సీరియస్ కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.