Telangana Inter exam fee schedule 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. ఆ రోజే లాస్ట్ డేట్!
Telangana Inter exam fee schedule 2027: తెలంగాణ ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించే అవకాశం.
Telangana Inter exam fee schedule 2027: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల.. ఆ రోజే లాస్ట్ డేట్!
Telangana Inter exam fee schedule 2027: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) రాబోయే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు (IPE) సంబంధించిన ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలని బోర్డు అధికారులు సూచించారు.
ఫీజు వివరాలు
అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా సాధారణ ఫీజు చెల్లించవచ్చు.
ఆలస్య రుసుముతో గడువు వివరాలు:
రూ. 100 ఫైన్‌తో: నవంబర్ 11 నుంచి నవంబర్ 20 వరకు
రూ. 500 ఫైన్‌తో: నవంబర్ 22 నుంచి నవంబర్ 29 వరకు
రూ. 1,000 ఫైన్‌తో: డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు
రూ. 2,000 ఫైన్‌తో: డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 14 వరకు
కోర్సుల వారీగా ఫీజు సవరణ:
ఫస్టియర్ రెగ్యులర్ & సెకండియర్ జనరల్ ఆర్ట్స్: రూ. 540
సెకండియర్ జనరల్ సైన్స్ (థియరీ + ప్రాక్టికల్స్): రూ. 890
ఫస్టియర్ & సెకండియర్ ఒకేషనల్: రూ. 890




