Telangana: తెలంగాణలో 41 కొత్త 2బీ బార్లకు నోటిఫికేషన్ విడుదల
Telangana: తెలంగాణలో కొత్తగా 41 ‘2బీ’ బార్ల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది; సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
Telangana: తెలంగాణలో 41 కొత్త 2బీ బార్లకు నోటిఫికేషన్ విడుదల
Telangana: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యూర్ పరిధిలోని 14 2బి బార్లకు, మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలో 27 2బీ బార్లకు దరఖాస్తుల స్వీకరణకు ప్రొహిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
రూ. లక్ష రుసుముతో ఈనెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
క్యూర్ ఏర్పాటు, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనంతో పెరిగిన జనాభాకు అనుగుణంగా 2బీ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది.
క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, పరిధిలోని 14 బార్లకు సంబంధించిన దరఖాస్తులను అబ్కారీ భవన్ కమిషనర్ కార్యాలయంలోనూ, క్యూర్ పరిధిలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలలో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎక్సైజ్ శాఖ కల్పించింది.
మిగిలిన జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల దరఖాస్తులను ఆయా ఉమ్మడి జిల్లాల డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలతో పాటు కమిషనర్ కార్యాలయంలోనూ, డిపిఈఓ కార్యాలయాల్లోనూ సమర్పించాల్సి ఉంటుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీ హరికిరణ్ తెలిపారు.
దరఖాస్తులను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 లోపు ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
సైబరాబాద్ డిప్యూటీ కమిషన్ పరిధిలోని అలియాబాద్ లో ఒకటి, మూడు చింతలపల్లి ఎల్లంపేట మున్సిపాలిటీలో రెండేసి 2బీ బార్లకు సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోనూ, కుత్బుల్లాపూర్ డి. పి. ఈ. ఓ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తారు.
రంగారెడ్డి డిప్యూటీ డిప్యూటీ కమిషనర్ పరిధిలోని ఫ్యూచర్ సిటీలో చేవెళ్ల మున్సిపాలిటీలో ఒకటి, మొయినాబాద్ మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ పరిగి మున్సిపాలిటీలో, సంగారెడ్డి జిల్లాలోని గడ్డి పోతారం, కోహిర్ మున్సిపాలిటీలో ఒకటి చొప్పున, గుమ్మడాల మున్సిపాలిటీలో రెండు 2బీ బార్లకు దరఖాస్తులను ఆహ్వానించడం అయినది.
అదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేట, కల్లూరు, మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్, మహబూబ్ నగర్, దేవరకద్ర,నిజామాబాద్ జిల్లాలోని బోధన్, కామారెడ్డి జిల్లాలోని బిడ్డకుంట,వరంగల్ జిల్లాలో నర్సంపేట్ జనగామ జిల్లాలో స్టేషన్ గన్ పూర్, మహబూబబాద్ జిల్లాలో కే సముద్రం, జయశంకర్ భూపాల జిల్లాలో ములుగు మున్సిపాలిటీలో కొత్త 2బీ బార్లకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఎక్సైజ్ శాఖ కల్పించారు.
క్యూర్ పరిధిలోని 2బీ బార్లకు రూ. 44 లక్షలు, నిజామాబాద్ బోధన్ బార్ కు రూ. 42 లక్షలు మిగిలిన 2బీ బార్లకు రూ. 30 లక్షలు సంవత్సరానికి ఎక్సైజ్ ఫీజుగా కట్టాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ పేర్కొంది.
మరిన్ని వివరాల కోసం tgbcl. telangana. gov. in వెబ్ సైట్ ను పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులు కోరారు.




