Kalvakuntla Kavitha: రైతుల పంటలు ఎండబెట్టారు.. ఇప్పుడు కమీషన్ల కోసం మరమ్మతులా?
Kalvakuntla Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలన్న నిర్ణయాన్ని కవిత స్వాగతించారు. అయితే ప్రభుత్వం కమీషన్ల కోసమే మరమ్మతులు చేస్తోందని, ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్‌కు నష్టం చేయవద్దని ఆమె విమర్శించారు.
Kalvakuntla Kavitha: రైతుల పంటలు ఎండబెట్టారు.. ఇప్పుడు కమీషన్ల కోసం మరమ్మతులా?
Kalvakuntla Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వాగతించారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె, గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేయడం వల్లే గత రెండున్నరేళ్లుగా పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని కవిత ఆరోపించారు. ప్రస్తుతం కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తున్నామనడం వెనుక కమీషన్ల ఆశే ఉందని ఆమె మండిపడ్డారు. అలాగే మున్సిపల్, అర్బన్ ఫారెస్ట్రీ శాఖల్లో భారీగా అవినీతి జరుగుతోందని ధ్వజమెత్తారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం 'ఫ్యూచర్ సిటీ' పేరుతో హైదరాబాద్ సహజత్వానికి, ప్రయోజనాలకు నష్టం కలిగించవద్దని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి రైతుల ప్రయోజనాల కోసం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆమె సూచించారు.


