Telangana: కార్మిక కుటుంబాలకు 100 గజాల స్థలం ఇవ్వాలని టీకేఎస్ డిమాండ్!

Telangana: రాష్ట్రంలోని ప్రతి కార్మిక కుటుంబానికి 100 గజాల స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని తెలంగాణ కార్మిక సమాఖ్య డిమాండ్ చేసింది.

HARISH, TARNAKA
Published on: 14 Sept 2026 4:43 PM IST
Telangana
X

Telangana: కార్మిక కుటుంబాలకు 100 గజాల స్థలం ఇవ్వాలని టీకేఎస్ డిమాండ్!

Telangana: రాష్ట్రంలోని ప్రతి కార్మిక కుటుంబానికి 100 గజాల స్థలం కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని తెలంగాణ కార్మిక సమాఖ్య (టీకేఎస్) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ సాధన కోసం అక్టోబర్‌ 28న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు టీకేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కలకోటి రామన్న తెలిపారు.

టీకేఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు నెమలిపురి నాగమణి రెడ్డి, చీఫ్ అడ్వైజర్ లక్ష్మణరావు అధ్యక్షతన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో దీక్షకు సంబంధించిన పాంప్లెట్‌ను ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా కడారి నాగేశ్వర్‌రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కడారి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ పేదలు, కార్మిక కుటుంబాలకు సొంత ఇంటి కల సాకారం కావాలంటే ప్రభుత్వం 100 గజాల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాళ్లపల్లి లింగం, ప్రైవేటు ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా కరుణాకర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శిగా భారతి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శిగా నల్ల శ్రీశైలం టీకేఎస్‌లో చేరి పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో టీకేఎస్ ప్రతినిధులు లక్ష్మణరావు, యాదగిరి, శేఖర్, పరశురాములు, కొండపల్లి లక్ష్మీ, ముంతాజ్ బేగం, రేణుక, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA