Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సిఫార్సు

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు.

Arun Chilukuri
Published on: 3 Sept 2026 2:40 PM IST
Konda Surekha
X

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సిఫార్సు

Konda Surekha: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న పరిణామానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా గవర్నర్‌కు సిఫార్సు లేఖ పంపారు.

మంత్రివర్గం నుంచి సురేఖను తక్షణమే బర్తరఫ్ చేయాలని సీఎం లేఖలో కోరగా, దీనిపై రాజ్ భవన్ వర్గాలు మరియు గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధిష్ఠానం ఆదేశాలు, సీఎం సిఫార్సుల నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story