Telangana: పాఠశాలలకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలి
Telangana: తెలంగాణలో పాఠశాలలకు శనివారం సెలవు ఇచ్చి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
Telangana: పాఠశాలలకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలి
తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, తెలంగాణలో పాఠశాలలకు ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని సీఎంకు విజ్ఞప్తి. పాఠశాలలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని దినాలుగా నిర్ణయించాలని వినతి...
ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఎండల తీవ్రత, నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదన చేసిన ఎమ్మెల్సీ మల్కా శనివారం సెలవు దినంగా ప్రకటించాలి.
ఈ విధానం వల్ల నీరు, విద్యుత్ వినియోగం తగ్గుతుంది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల రాకపోకలు తగ్గి ట్రాఫిక్ సమస్య, వాహన కాలుష్యం కూడా తగ్గుతాయి.
ఎండల తీవ్రత నుంచి విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ పాఠశాల సమయాన్ని 35 నుంచి 40 నిమిషాలు పెంచాలని సూచించారు.




