Telangana: పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ఇన్‌కమ్ ఆధారంగా గ్రేడింగ్, ప్రమోషన్లు..

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వాటి వార్షిక ఆదాయం ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది.

Ravi
By Ravi
Published on: 14 Jun 2026 8:30 AM IST
Telangana
X

Telangana: పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ఇన్‌కమ్ ఆధారంగా గ్రేడింగ్, ప్రమోషన్లు..

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను మరింత పటిష్టం చేసేందుకు అధికారులు కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే వార్షిక ఆదాయం ఆధారంగా వాటిని 4 గ్రేడ్లుగా విభజించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.

ఆదాయం ఆధారంగా పంచాయతీల గ్రేడింగ్ ఇలా:

పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనల ప్రకారం ఆదాయం ఆధారంగా పంచాయతీలను ఈ విధంగా వర్గీకరించనున్నారు:

గ్రేడ్-1: వార్షిక ఆదాయం రూ. 19 లక్షల కంటే ఎక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్-1గా గుర్తిస్తారు. ఈ కేటగిరీలో మొత్తం 945 పోస్టులను కేటాయించారు.

గ్రేడ్-2: వార్షిక ఆదాయం రూ. 13 లక్షల నుండి రూ. 19 లక్షల మధ్య ఉన్న వాటిని గ్రేడ్-2లోకి చేరుస్తారు. దీని కింద 1,258 పోస్టులు కేటాయించడం జరిగింది.

గ్రేడ్-3: రూ. 7 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు ఆదాయం ఉన్న పంచాయతీలకు గ్రేడ్-3 హోదా ఇస్తారు. ఇక్కడ 3,769 పోస్టులు కేటాయించారు.

గ్రేడ్-4: వార్షిక ఆదాయం రూ. 7 లక్షల కంటే తక్కువగా ఉన్న పంచాయతీలను గ్రేడ్-4గా పరిగణిస్తారు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ విభాగంలోనే 6,788 పోస్టులను కేటాయించారు.

కార్యదర్శులకు ప్రమోషన్లు:

ప్రస్తుతం ఈ 4 గ్రేడ్ల విధానం ప్రతిపాదనల దశలో ఉంది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం గనక అధికారికంగా ఆమోదిస్తే, ఆయా గ్రేడ్లకు అనుగుణంగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ కార్యదర్శులకు త్వరలోనే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story