తెలంగాణలో సవాళ్ల పర్వం: రేవంత్ సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్!
Revanth Reddy Vs KTR: తెలంగాణలో సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
తెలంగాణలో సవాళ్ల పర్వం: రేవంత్ సవాల్‌ను స్వీకరించిన కేటీఆర్!
Revanth Reddy Vs KTR: సవాళ్లు ప్రతిసవాళ్లతో తెలంగాణ రాష్ర్ట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పదేళ్ళ బీఆర్ఎస్ పాలన, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ స్వీకరించారు. అప్పులుస, పాలన వైఫల్యాలు, రైతుల దుస్థికతి, వ్యవసాయ సంక్షోభం, ఆర్దిక పరిస్థితి దేనిపైనానా సరే చర్చిద్దాం అంటూ ప్రతిసవాల్ చేశారు. చర్చకు రేవంత్ రెడ్డి వస్తరా.. రాహుల్ గాంధీ వస్తారో ఎవరోస్తారో తేల్చుకోవాలన్నారు. సమయం, తేదీ, స్థలం టాపిక్ మీరే డిసైడ్ చేసుకోవాలనన్నారు.
బీఆర్ఎస్ ప్రతిసవాల్ కు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదురు సవాల్ చేశారు. లెక్కలతో సహా తెలంగాణ భవన్ కు వస్తానన్నారు. ఒకవేళ తాను చూపించే లెక్కలు తప్పని తేలితే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ చేశారు.




