Telangana Rain Alert: తెలంగాణలో రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Telangana Rain Alert: తెలంగాణలో రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందాని ఐఎండీ హెచ్చరించింది. భద్రాద్రి, ఖమ్మం సహా పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Oct 2026 8:29 PM IST
Telangana Rain Alert
X

Telangana Rain Alert: తెలంగాణలో రేపు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Telangana Rain Alert: తెలంగాణలో వాతావరణం మరోసారి మారుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం ఉదయం 8:30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయకపోవడం మంచిదని హెచ్చరించారు.

గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు

వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురుగాలుల కారణంగా చెట్లు, కొమ్మలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని సూచించింది.

రైతులు, వ్యవసాయ కూలీలు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పనులు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని హెచ్చరించారు.

అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ వర్షాలు

తెలంగాణలో వర్షాల ప్రభావం సోమవారంతోనే ముగిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 5, 6 తేదీల్లోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు అక్కడక్కడా వర్షాలు కొనసాగే అవకాశముంది.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ ప్రకటించిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్