Weather Update: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!
Weather Update: తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Weather Update: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!
Weather Update: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మరో రెండు నుంచి మూడు గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అటు రాజధాని హైదరాబాద్‌లో కూడా ఈరోజు సాయంత్రం మోస్తరు వర్షం కురిసే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసిన తరుణంలో, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగళ్ల వాన వల్ల పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున, ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు సిద్ధం చేసుకోవాలని కోరుతున్నారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




