Sircilla: తెలంగాణ రక్షణ సేనకు 23 నియోజకవర్గ ఇన్‌చార్జీల నియామకం!

Sircilla: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జీలను నియమించారు.

KALEEM, SIRICILLA
Published on: 15 July 2026 11:55 PM IST
Sircilla
X

Sircilla: తెలంగాణ రక్షణ సేనకు 23 నియోజకవర్గ ఇన్‌చార్జీల నియామకం!

సిరిసిల్ల: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలోని 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జీలను నియమించారు. తొలి విడతలో ఈ నియామకాలను ప్రకటించిన పార్టీ అధిష్ఠానం, మిగతా నియోజకవర్గాలకు కూడా దశలవారీగా ఇన్‌చార్జీలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, పార్టీ చీఫ్‌కు అదృష్ట సంఖ్యగా భావించే 5కు అనుగుణంగా మొత్తం 23 మంది ఇన్‌చార్జీలను ప్రకటించినట్లు తెలిపారు. ఆషాఢ మాసంలో శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని ఈ నియామకాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితులైన మజీద్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కవితక్క ఆశయాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు.

పార్టీ అభివృద్ధి, ప్రజా సేవే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మజీద్, తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story