Revanth Reddy: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ!
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో భేటీ అయ్యింది.
Revanth Reddy: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ!
Revanth Reddy: తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం విద్యావేత్తల బృందంతో ఫలప్రదమైన సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్‌రెడ్డి గారి నేతృత్వంలోని ఈ బృందం తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించింది.
సమావేశంలో ముఖ్యమంత్రి గారితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గారు, సీఎం సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలకు ఉన్న అవకాశాలను వివరించి, ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని కేంబ్రిడ్జ్ ప్రతినిధులను ఆహ్వానించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు గారు, వెంకట సిరీష్ గండికోట గారు తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అవకాశాలపై సానుకూలంగా స్పందించారు.
హైదరాబాద్‌లో విద్యా కార్యక్రమాలు, సంయుక్త పరిశోధనలు, యువ పారిశ్రామికవేత్తల ఇంక్యుబేషన్, స్టార్టప్‌ల అభివృద్ధికి సహకారంపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. కేంబ్రిడ్జ్‌తో తెలంగాణ భాగస్వామ్యానికి ఈ చర్చలు కొత్త మార్గం చూపనున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ విద్యా, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ రైజింగ్ లక్ష్యానికి ఇది మరింత బలం చేకూర్చనుంది.




