TGSRTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు కౌండౌన్ స్టార్ట్.. 48 గంటల్లో..
RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు రంగం సిద్ధమైంది. 48 గంటల్లో ప్రారంభం కానున్న సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.
TGSRTC Strike: ఆర్టీసీ సమ్మెకు కౌండౌన్ స్టార్ట్.. 48 గంటల్లో..
TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TG RTC)లో సమ్మె సెగ మొదలైంది. కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు సిద్ధమవడంతో, కేవలం 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించకపోవడంతో సమ్మె అనివార్యమని తెలుస్తోంది.
తమ సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ రావాలని ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ, ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టత రాలేదు. దీంతో ప్రకటించిన ముహూర్తం ప్రకారం సమ్మెకు వెళ్తామని జేఏసీ నేతలు తేల్చి చెబుతున్నారు.
సమ్మె వల్ల సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అప్రమత్తమయ్యారు. రేపు ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సమ్మె జరిగితే ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ వాహనాలను నడపడం, తాత్కాలిక డ్రైవర్లను నియమించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
మరోవైపు, ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఉందని చెబుతున్నా, ఆచరణలో నిర్ణయాలు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. రేపటి సమావేశం తర్వాత సమ్మెపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




