Mulugu: ములుగు జిల్లాకు కొత్త న్యాయస్థానం మంజూరు: ఉత్తర్వులు జారీ!

Mulugu: తెలంగాణలో 200కొత్త జూనియర్ సివిల్ కోర్టులను ప్రభుత్వం మంజూరు చేసింది ములుగు జిల్లాకు కొత్త కోర్టు దక్కడంతో పెండింగ్ కేసుల పరిష్కారానికి మార్గం సుగమమైంది

PONNALA SWAMY, MULUGU
Published on: 26 Sept 2026 7:56 AM IST
Mulugu
X

Mulugu: ములుగు జిల్లాకు కొత్త న్యాయస్థానం మంజూరు: ఉత్తర్వులు జారీ!

Mulugu: ములుగుజిల్లాకు కొత్త న్యాయస్థానం మంజూరుచేస్తూ ఉత్తర్వులు రిలీజ్ చేసిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త న్యాయస్థానాలకు ప్రభుత్వం అనుమతి. రాష్ట్రంలో న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి

200 కొత్త అదనపు జూనియర్ సివిల్ న్యాయస్థానాల ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయశాఖ జీవో నంబర్ 59, తేదీ 24-09-2026న ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కొత్త న్యాయస్థానాలు ఏర్పాటు.

ములుగులో కొత్త న్యాయస్థానం ఏర్పాటుతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి మరింత అవకాశం కలగడంతో పాటు ప్రజలకు న్యాయ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

కొత్త న్యాయస్థానాలకు అవసరమైన సిబ్బంది, భవనాలు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన తదుపరి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా మేడ్చల్‌–మల్కాజిగిరికి 19, రంగారెడ్డికి 18 న్యాయస్థానాలు కేటాయించగా, హన్మకొండకు 6, వరంగల్‌కు 4, మహబూబాబాద్‌కు 3 న్యాయస్థానాలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

PONNALA SWAMY, MULUGU

PONNALA SWAMY, MULUGU