తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. పాల్గొన్న గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అయిన 'తెలంగాణ తల్లి' విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో కొలువుదీరింది.

Arun Chilukuri
Updated on: 16 March 2026 3:35 PM IST
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. పాల్గొన్న గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి
X

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అయిన 'తెలంగాణ తల్లి' విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో కొలువుదీరింది. పునరుద్ధరించిన శాసనమండలి భవనం ముందు ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల వేదికగా విగ్రహావిష్కరణ మహోత్సవం కనులపండువగా సాగింది.

హాజరైన ప్రముఖులు

ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణానికి కొత్త హంగులు అద్దుతూ, పునరుద్ధరించిన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ విగ్రహ రూపకల్పన జరిగింది.

విగ్రహావిష్కరణ అనంతరం గవర్నర్, సీఎం మరియు ఇతర నేతలు తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story