Telangana Vahan Portal: తెలంగాణలో వాహన్ పోర్టల్ షురూ.. ఆన్‌లైన్‌లోనే వాహన రిజిస్ట్రేషన్లు!
Telangana Vahan Portal: తెలంగాణ రవాణా శాఖ వాహన్ పోర్టల్‌ను విజయవంతంగా అమలు చేస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి.
Telangana Vahan Portal: తెలంగాణలో వాహన్ పోర్టల్ షురూ.. ఆన్‌లైన్‌లోనే వాహన రిజిస్ట్రేషన్లు!
Telangana Vahan Portal: తెలంగాణ రవాణా శాఖ తన సేవలన్నింటినీ పూర్తిగా డిజిటలైజ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జాతీయ స్థాయి ప్లాట్‌ఫారమ్ 'వాహన్ పోర్టల్' (Vahan Portal) అమలును రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా ప్రారంభించింది. ఎన్‌ఐసీ (NIC) సాంకేతిక సహకారంతో సాగుతున్న ఈ ప్రక్రియలో ఇప్పటికే కీలక మైలురాళ్లను అధిగమించినట్లు అధికారులు వెల్లడించారు.
వాహన్ పోర్టల్ గణాంకాలు:
టెంపరరీ రిజిస్ట్రేషన్లు: రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 68,846 తాత్కాలిక రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు: 23,705 వాహనాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లను కేటాయించారు.
ఫ్యాన్సీ నంబర్లు: ఫ్యాన్సీ నంబర్ మాడ్యూల్ అత్యంత పారదర్శకంగా సాగుతోంది. ఇప్పటివరకు 1,880 ఫ్యాన్సీ నంబర్లకు ఆన్‌లైన్ రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
పారదర్శకతే ప్రధాన లక్ష్యం:
గతంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తలెత్తే జాప్యం, అవకతవకలను నివారించేందుకు వాహన్ పోర్టల్ దోహదపడుతోంది. పారదర్శకంగా నంబర్ల కేటాయింపు మరియు వేగవంతమైన సేవలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా రవాణా శాఖ పనిచేస్తోంది. పెండింగ్ కేసులపై అధికారులు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తూ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తున్నారు.
మరో 15 రోజుల్లో పూర్తిస్థాయిలో..
ప్రస్తుతం అమలులో ఉన్న మాడ్యూల్స్‌తో పాటు, మిగిలిన అదనపు సేవలను కూడా దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. మరో 15 రోజుల్లో వాహన్ వ్యవస్థ రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో స్థిరపడుతుందని, తద్వారా వాహనదారులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ సేవలు అందుతాయని అధికారులు స్పష్టం చేశారు.




