Heatwave Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్!

Heatwave Alert: తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఆదిలాబాద్‌లో గరిష్టంగా 45.1 డిగ్రీలు నమోదు కాగా, రాబోయే రెండు రోజుల్లో 47 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Arun Chilukuri
Published on: 27 April 2026 4:55 PM IST
Heatwave Alert
X

Heatwave Alert: తెలంగాణలో నిప్పుల కొలిమి: 47 డిగ్రీలకు చేరనున్న ఎండలు.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్!

Heatwave Alert: తెలంగాణలో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుతుండటంతో వాతావరణ శాఖ అత్యంత అప్రమత్తత ప్రకటించింది. ఈ వేసవిలోనే అత్యధికంగా ఆదిలాబాద్‌లో 45.3°C ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కొమరంభీమ్, నిర్మల్, జగిత్యాల మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఐఎండీ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో ఉష్ణోగ్రతలు 47°C వరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

హైదరాబాద్ నగరంలోనూ ఎండలు ముదురుతున్నాయి. ఆదివారం అంబర్‌పేట, యూసుఫ్‌గూడలో 42°C ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని, అయితే కొన్నిచోట్ల స్థానిక పరిస్థితుల వల్ల సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగినంత నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story