Telangana Weather Update: తెలంగాణలో పెరుగుతున్న ఎండలు: రానున్న 3 రోజులు అత్యంత కీలకం!

Telangana Weather Update: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత పెరగనుంది.

Arun Chilukuri
Published on: 15 April 2026 5:01 PM IST
Telangana Weather Update
X

Telangana Weather Update: తెలంగాణలో పెరుగుతున్న ఎండలు: రానున్న 3 రోజులు అత్యంత కీలకం!

Telangana Weather Update: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న మూడు రోజుల్లో ఇవి మరో 1 నుంచి 2 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడగాలులు (Heat Waves) వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌తో పాటు ఖమ్మం, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీయవచ్చు.

గురువారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు జారీ చేశారు.

మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగుతూ ఉండాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story