Weather Alert: మండుతున్న ఎండల వేళ కూల్ న్యూస్.. ఆ ప్రాంతాల్లో ఇక వర్షాలే వర్షాలు

Unseasonal Rains Telugu States: ఎండలతో ఉక్కిరిబిక్కిరైన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే కొద్ది రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా మార్చి 18 నుంచి 19 వరకు కొన్ని ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని సూచనలు వెలువడ్డాయి.

Venkat
Published on: 15 March 2026 9:18 PM IST
Weather Alert
X

Weather Alert: మండుతున్న ఎండల వేళ కూల్ న్యూస్.. ఆ ప్రాంతాల్లో ఇక వర్షాలే వర్షాలు

Telangana Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వేసవి వేడి కొనసాగుతుండగానే, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలకు వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ మార్చి 15, 2026న విడుదల చేసిన హెచ్చరికల ప్రకారం, తెలంగాణలో మార్చి 15 నుంచి 19 వరకు పలు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీర ప్రాంతాలు, యానాం ప్రాంతాల్లో మార్చి 16 నుంచి 18 మధ్య ఉరుములతో కూడిన వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాన్ని అధికారులు పేర్కొన్నారు.

నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు కీలక సూచనలు..

నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రస్తుతం ఎండ తీవ్రంగానే ఉన్నప్పటికీ, మార్చి 18 నుంచి మధ్యాహ్నం తర్వాత ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాన్ని తాజా ఫోర్‌కాస్ట్ చూపిస్తోంది. నిజామాబాద్‌లో మార్చి 18న పిడుగులతో కూడిన వర్షం చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా ఉండగా, నిర్మల్‌లో కూడా అదే రోజు, అలాగే మార్చి 19న ఉరుములతో కూడిన వానలు పడొచ్చని సూచించింది. దీంతో రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పని చేసే వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఉత్తరాంధ్రలోనూ మారనున్న వాతావరణం..

అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం జిల్లాల్లో మార్చి 17 నుంచి 19 మధ్య ఉరుములతో కూడిన వర్షాల అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా విజయనగరంలో మార్చి 17, 18 తేదీల్లో మధ్యాహ్నం తర్వాత తుఫాను మేఘాలు, ఉరుములతో కూడిన వర్ష సూచనలు ఉన్నాయి. శ్రీకాకుళంలో మాత్రం ప్రధానంగా మేఘావృత వాతావరణం, ఈదురుగాలులు కనిపిస్తున్నప్పటికీ, భారీ వర్ష సంకేతాలు ప్రస్తుతం తక్కువగా కనిపిస్తున్నాయి.

మార్చి 18-19 కీలకం..

ముఖ్యంగా మార్చి 18 నుంచి 20 మధ్య తెలంగాణలో పిడుగులు, వడగళ్ల వానలు వచ్చే అవకాశం ఉందంట. IMD హైదరాబాద్ కేంద్రం విడుదల చేసిన బులెటిన్‌లో మాత్రం మార్చి 18, 19 తేదీల్లో తెలంగాణ జిల్లాలవ్యాప్తంగా 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాల యెల్లో అలర్ట్ ఉన్నట్లు పేర్కొంది.

రైతులకు సూచనలు..

ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద, బహిరంగ మైదానాల్లో నిలవకూడదు. రైతులు కోత దశలో ఉన్న పంటలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవడం మంచిది. విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక హోర్డింగ్‌లు, షెడ్లు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. రాబోయే 72 గంటలు పరిస్థితిని బట్టి స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించడం అవసరం.

Venkat

Venkat

Next Story