Erravalli: కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ డప్పుల మోత నిరసన.. ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
Erravalli: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల డప్పుల మోత నిరసనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Erravalli: కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ డప్పుల మోత నిరసన.. ఎర్రవల్లిలో తీవ్ర ఉద్రిక్తత
Erravalli: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోతతో నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. నర్సారెడ్డి ఆధ్వర్యంలో వరదరాజపూర్ మీదుగా కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాయి. మార్గమధ్యలో పోలీసులు బారికేడ్లు, రోప్ పార్టీలతో అడ్డుకోవడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.
ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు అర కిలోమీటరు దూరంలోకి వెళ్లి డప్పుల మోతతో నిరసన తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి నిరసనకారులను వెనక్కి పంపించారు. ఈ ఆందోళనలను అదుపు చేసే ప్రయత్నంలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఒక దశలో డీసీసీ అధ్యక్షురాలు బారికేడ్లు తోసుకుని ఫామ్‌హౌస్ వైపు పరుగులు తీశారు. మరోవైపు మర్కుక్ వద్ద బీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా మోహరించి, రైతు దీక్ష పేరుతో ఆందోళనకు దిగడంతో ఎర్రవల్లి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.




