Karimnagar: తాజ్ హోటల్ బిల్లులు కట్టే సర్కారుకు.. ఆశల ఆకలి తీర్చడం చేతకాదా?

Karimnagar: కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆశా కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. తమను అక్రమంగా అరెస్ట్ చేసి కనీసం మంచినీళ్లు, టిఫిన్ కూడా ఇవ్వలేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 March 2026 5:59 PM IST
Karimnagar
X

Karimnagar: తాజ్ హోటల్ బిల్లులు కట్టే సర్కారుకు.. ఆశల ఆకలి తీర్చడం చేతకాదా?

కరీంనగర్: హైద్రాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమం కి బయలుదేరిన ఆశ వర్కర్స్ లను నిన్నటి నుంచి అక్రమ అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలోపెట్టిన,పట్టు వదలని ఆశ వర్కర్స్ ధర్నా కార్యక్రమం బయలు దేరారు.ఉదయం నుంచి ఎక్కడికి అక్కడ బస్సులను ఆటోలను కార్లను చెక్ చేస్తూ బలవంతంగా ఆశా కార్యకర్తల ఫోన్స్ లాక్కొని అరెస్టులు చేసి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.

కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో దాదాపు 500 మంది వరకు వివిధ జిల్లాల ఆశా కార్యకర్తలు పొద్దున నుండి మేము టిఫిన్లు చేయలేదు, మంచినీళ్లు కూడా తాగలేదు, కాబట్టి మాకు టిఫిన్ పెట్టండి లేదా వదిలిపెట్టండి అని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.

అనారోగ్యాలకు గురై సొమ్మసిల్లి పడిపోయిన ఆశ వర్కర్స్..

నిన్నటి నుండి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆశా కార్యకర్తలు భోజనం లేకపోవడం వల్ల అనారోగ్య కారణాలవల్ల సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆశా కార్యకర్తలు తెగించి కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నుండి బయటికి వెళ్లడానికి పరుగులు తీశారు. దీని గమనించిన పోలీసు అధికారులు సొమ్మసిల్లిన ఆశా కార్యకర్తలను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మిగిలిన ఆశా కార్యకర్తలు కస్టడీలో ఉండాలని ఒత్తిడి.

మీరు మాకు భోజనాలు పెట్టండి లేదా మేము బయటికి వెళ్లి అన్నం తింటాం ఇక్కడ ఉంటే మేము బతికే పరిస్థితి లేదు కాబట్టి మమ్మల్ని వదిలిపెట్టండి అని గట్టిగా తెగించి పోరాటం చేశారు. పి టి సి అవుట్ గేటు వరకు ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడం వల్ల పోలీసులు వారిని వదిలిపెట్టడం జరిగింది. మహిళల కోసం పనిచేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నా, మహిళలను కోటీశ్వరులు చేస్తామని ప్రగల్బాల్ పలుకుతున్న ముఖ్యమంత్రి కనీసం అరెస్టు అయిన మహిళలకు మంచినీళ్లు టిఫిన్లు భోజనాలు కూడా పెట్టలేరా.

మీరు ఒక పూట భోజనం చేస్తే 32 వేల రూపాయలు బిల్లు తాజ్ హోటల్ కి పెట్టుకొని తింటున్నారు. అదే వీరికి కనీసం 30 రూపాయలు పెట్టీ మంచినీళ్లు టిఫిను పెట్టడానికి మీకు చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం రాకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story