TG EAPCET 2026: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
టీజీ ఈఏపీసెట్ ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
TG EAPCET 2026
తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET) ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. రెండో విడత సీట్ల కేటాయింపు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మొదటి విడతలో కోరుకున్న సీటు రాని విద్యార్థులతో పాటు కొత్తగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న సుమారు 60 వేల మంది అభ్యర్థులు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్, ఎంపిక చేసిన ప్రాధాన్యతల ఆధారంగా కళాశాలలు, కోర్సులను కేటాయిస్తూ అధికారులు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్లను జారీ చేశారు.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో Candidate Login ద్వారా లాగిన్ అయి తమ లాగిన్ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పాస్‌వర్డ్, జన్మతేదీ వివరాలను నమోదు చేసి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
సీటు కేటాయించబడిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, అలాట్‌మెంట్ లెటర్‌తో సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయకపోతే కేటాయించిన సీటు రద్దయ్యే అవకాశం ఉండటంతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.




