TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఆ పథకం నిలిపేశారు.. ఎందుకంటే
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు షాక్. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే ఇచ్చే ప్రత్యేక ఇంక్రిమెంట్ రద్దు చేస్తూ టీజీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులుజారీచేసింది.
TGSRTC
TGSRTC: ఉద్యోగుల కోసం చాలాకాలంగా కొనసాగుతున్న ఒక పథకాన్ని తెలంగాణా ఆర్టీసీ లో నిలిపివేశారు. ఉద్యోగులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ప్రత్యేక ప్రోత్సాహకం కింద ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇప్పటివరకూ ఇస్తున్నారు. ఇప్పుడు దానిని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.
ఇకపై తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ ప్రత్యేకంగా ఏవిధమైన బెనిఫిట్ ఉండదు. నిజానికి ప్రభుత్వం ఎప్పుడో ఇటువంటి ఇంక్రిమెంట్స్ నిలిపివేసింది. అయితే, ఆర్టీసీ కార్పొరేషన్ కావడంతో ఇక్కడ ఇప్పటివరకూ అది అమలులోకి రాలేదు. తాజాగా ప్రభుత్వ నిబంధనలకు సమానంగా కార్పొరేషన్ లోని నిబంధనలు కూడా ఉండాలనే విధానంలో భాగంగా టీజీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఏమిటి ఈ పథకం..
కుటుంబ నియంత్రణ విధానాలను ఉద్యోగులు పాటించే విధంగా ప్రోత్సహించడం కోసం 2000 దశకం ప్రారంభంలో ఈ పథకం తీసుకువచ్చారు. ఇందులో భాగంగా ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత స్టెరిలైజేషన్ చేయించుకుంటే ఉద్యోగులు లేదా వారి జీవిత భాగస్వాములకు పర్సనల్ సాలరీ రూపంలో ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చేవారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 1998లోనే ఈ పథకాన్ని నిలిపివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం నిలిపివేసినా.. ఇప్పటికీ విభజన తరువాత కూడా దీనిని టీజీఎస్ ఆర్టీసీ కొనసాగిస్తూ వస్తోంది.
ప్రస్తుత పరిస్థితి..
ప్రభుత్వ నిబంధనలలోని వైరుధ్యాలను తొలగించడం లక్ష్యంగా ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సవరించిన ఉత్తర్వుల ప్రకారం, మార్చి 17, 2026న లేదా ఆ తర్వాత కుటుంబ నియంత్రణ ప్రక్రియలు చేయించుకునే ఉద్యోగులు ఇకపై ఈ ప్రోత్సాహక ఇంక్రిమెంట్ కు అర్హులు కారు.
కుటుంబ నియంత్రణ కోసం ఇస్తున్న ఈ ఇంక్రిమెంట్ నిలిపివేసినా.. కొన్ని సంక్షేమ చర్యలను మాత్రం కొనసాగిస్తారు. ఈ పథకం నిలిచిపోయినా.. కుటుంబ నియంత్రణ ప్రక్రియలు చేయించుకోవడానికి ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ఇచ్చే విధానం కొనసాగుతుంది. దీనివలన ఉద్యోగులకు మెడికల్
ఎప్పట్నించి..
సవరించిన ఈ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని, సంస్థ అంతటా దానిని కచ్చితంగా పాటించేలా చూడాలని తెలంగాణ ఆర్టీసీ తాజా సర్క్యులర్ యూనిట్ స్థాయి అధికారులందరినీ ఆదేశించింది. అంటే వెంటనే ఈ విధానం అమలులోకి వస్తుంది.




