TGSRTC: మళ్లీ సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు.. 13న సమ్మె నోటీసు

TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈనెల 13న సమ్మె నోటీసు ఇవ్వనున్న జేఏసీ, 24న ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేపట్టనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 March 2026 11:53 AM IST
TSRTC :మళ్లీ సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు.. 13న సమ్మె నోటీసు
X

TSRTC :మళ్లీ సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు.. 13న సమ్మె నోటీసు

TGSRTC: తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మిక జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న సమ్మె నోటీసు ఇవ్వాలని కార్మిక జేఏసీ నిర్ణయించింది.

అలాగే ఈ నెల 24న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద కార్మిక సంఘాలు దీక్ష చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదని కార్మిక జేఏసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత సంవత్సరం మే నెలలో సమ్మెకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులు, అప్పటి మంత్రి ఇచ్చిన హామీ నేపథ్యంలో సమ్మెను విరమించుకున్నారు. అయితే సంవత్సరం గడిచినా కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈసారి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story