TGSRTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. 24 గంటల్లో నిలిచిపోనున్న 7వేల బస్సులు..?

TGSRTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్! మరో 24 గంటల్లో సమ్మెకు దిగనున్న కార్మికులు. 7వేల బస్సులు నిలిచిపోయే అవకాశం.

Arun Chilukuri
Published on: 21 April 2026 10:49 AM IST
TGSRTC Strike
X

TGSRTC Strike: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. 24 గంటల్లో నిలిచిపోనున్న 7వేల బస్సులు..?

TGSRTC Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సెగ మొదలైంది. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు కార్మిక సంఘాల జేఏసీ (JAC) సిద్ధమైంది. మరో 24 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు కార్మికులు సమాయత్తమవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

సమ్మె నోటీసు ఇచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఎలాంటి పిలుపు రాలేదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని యూనియన్లు ఒక్కతాటిపైకి వచ్చి సమ్మెను విజయవంతం చేయాలని నిర్ణయించుకున్నాయి. నేడు మధ్యాహ్నం 12 గంటలకు తదుపరి కార్యాచరణను ప్రకటించనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది.

ఒకవేళ సమ్మె ప్రారంభమైతే ఆర్టీసీకి చెందిన సుమారు 7,000 బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. దీనివల్ల సామాన్య ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. అయితే, అద్దె బస్సుల సంఘం మాత్రం సమ్మెకు మద్దతు తెలపలేదు. తమ ఆధీనంలో ఉన్న 3,000 అద్దె బస్సులను యథావిధిగా నడుపుతామని ఆ సంఘం ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం ఈ లోపే స్పందించి చర్చలు జరుపుతుందో లేదో చూడాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story