Kamareddy: బరితెగించిన దొంగలు.. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

Kamareddy: కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 April 2026 8:36 PM IST
Kamareddy
X

Kamareddy: బరితెగించిన దొంగలు.. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

Kamareddy: పెద్ద కొడప్ గల్ (కామారెడ్డి)తాళం వేసి ఉన్న ఇండ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఘటన ల తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బాన్సువాడ పట్టణంలోని తపాలా కార్యాలయంలో రాత్రి జరిగిన చోరీ మరువక ముందే జుక్కల్ నియోజకవర్గం లోని పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

పెద్ద కొడప్ గల్ కు చెందిన దొమ్మంటి ప్రవీణ్ రెడ్డి గత 9 రోజుల క్రితం తన పని నిమిత్తం ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా హైదరాబాద్ కు వెళ్లగా తన ఇంటి తలుపులు తీసి ఉన్నాయని పక్కింటి వారు ఫోన్ ద్వార తెలపడం తో తన ఇంటికి వచ్చి చూసుకోగా బీరువాలో దాచిన 250 గ్రాముల వెండి పళ్ళెం, సుమారు 5 వేల నగదు ఎవరో గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారని విషయం బాధితుడు ఫోన్ ద్వార పోలీసులకు తెల్పగా ఎస్సై బాధితుడి ఇంటి వద్దకు వెళ్లి పిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story