Timmapur: కాంగ్రెస్ మోసపూరిత హామీలతోనే గద్దెనెక్కింది
Timmapur: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను వంచిస్తోందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు.
Timmapur: కాంగ్రెస్ మోసపూరిత హామీలతోనే గద్దెనెక్కింది
Timmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని, అందుకే నాయకులు పార్టీని వీడుతున్నారని రసమయి బాలకిషన్ అన్నారు. ప్రజలను మోసం చేయడమే కాకుండా పార్టీ నాయకులను సైతం కాంగ్రెస్ మోసం చేస్తుందని విమర్శించారు.
ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేసినందుకే నిరసనగా ఆయన బీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు.ఈ సందర్భంగా ఈ నెల 20న జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సభకు హాజరై కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
మానకొండూర్ నియోజకవర్గం నుండి పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రసమయి కోరారు. ఈ విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు సిద్దం వేణు,
కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, రావుల రమేష్, తాళ్లపల్లి శేఖర్ గౌడ్, గంప వెంకన్న, లింగపెల్లి శ్రీనివాస రెడ్డి,నాయిని వెంకటరెడ్డి, పాశం అశోక్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్ గౌడ్,ఎడ్ల బుచ్చిరెడ్డి, అవుదుర్తి రాంకిషన్, దుర్గం శ్రీనివాస్, గాండ్ల శ్రీనివాస్, సల్ల మహేందర్, బోయిని తిరుపతి, రెడ్డి తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




