Mahesh Kumar Goud: గచ్చిబౌలి, పోచంపల్లి ప్రమాదాలపై టీపీసీసీ చీఫ్ దిగ్భ్రాంతి

Mahesh Kumar Goud: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన, పోచంపల్లి ఫార్మా రియాక్టర్ పేలుడు ప్రమాదాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Aug 2026 11:37 PM IST
Mahesh Kumar Goud
X

Mahesh Kumar Goud: గచ్చిబౌలి, పోచంపల్లి ప్రమాదాలపై టీపీసీసీ చీఫ్ దిగ్భ్రాంతి

Mahesh Kumar Goud: గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని హజెలో ఫార్మా సంస్థలో రియాక్టర్‌ పేలుడు అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందడంపై టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం, అవసరమైన సహాయం అందించాలని అధికారులను కోరారు. నిర్మాణ, పారిశ్రామిక రంగాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలు చేపట్టాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story